రానా “విరాట పర్వం” కు ముహూర్తం కుదిరింది

Published on Jun 15, 2019 1:10 am IST

హీరో దగ్గుబాటి రానా తన తదుపరి మూవీ గా “విరాట పర్వం” అనే పీరియాడిక్ సోషల్ డ్రామా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా ఈ మూవీని దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. ఐతే ఈ మూవీ రేపు 10:30 నిమిషాలకు రామానాయుడు స్టూడియో లో పూజాకార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వేణు ఉడుగుల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా “విరాట పర్వం” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ మూవీ పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

More