‘విరాట పర్వం’ లాంచింగ్ లో వారిద్దరి సందడి మిస్సయింది

Published on Jun 15, 2019 3:35 pm IST

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం` . శ్రీవిష్ణు హీరోగా ‘నీదినాది ఒకే కథ’ అనే వైవిధ్యమైన చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన వేణు ఉడుగుల తన రెండో సినిమాగా ‘విరాట పర్వం’ తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణా ప్రాంతంలో 1990 నాటి సామజిక పరిస్థితులు ప్రతిబింబించే పీరియాడిక్ సోషల్ డ్రామా ఈమూవీ తెరకెక్కనుందని సమాచారం.

ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా,అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐతే విశేషం ఏమిటంటే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న హీరో రానా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.,హీరోయిన్ సాయి పల్లవి వచ్చినా కొద్దిసేపటికే వెళ్లిపోవడంతో, వెంకటేష్,సురేష్ బాబు దర్శకుడు వేణు వీళ్ళందరూ ఉన్నాకాని రానా,సాయి పల్లవి లేని కార్యక్రమానికి కళ రాలేదు. వీళ్లిద్దరూ ఆయా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండటం వలెనే వారు ఈ కార్యక్రమానికి తమ సమయం కేటాయించలేకపోయారని తెలుస్తుంది. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :

More