అదిరిపోయిన రణబీర్ కపూర్ ‘యానిమల్’ ఫస్ట్ లుక్ పోస్టర్

అదిరిపోయిన రణబీర్ కపూర్ ‘యానిమల్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Published on Jan 1, 2023 12:22 AM IST

బాలీవుడ్ యువ నటుడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ యానిమల్. భారీ యాక్షన్ తో కూడిన డ్రామా మూవీ గా రూపొందుతోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా పరిణీతి చోప్రా, అనిల్ కపూర్, బాబీ డియోల్, రాఘవ్ బినాని తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఇక ఈ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న యానిమల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు న్యూ ఇయర్ సందర్భంగా సరిగ్గా రాత్రి 12 గంటలకు రిలీజ్ చేసారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో గుబురు గడ్డంతో సిగరెట్ వెలిగిస్తూ, రణబీర్ గొడ్డలి కలిగి ఉన్న పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 11న ఈ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు