సెన్సార్ పూర్తి చేసుకున్న రణరంగం

Published on Aug 8, 2019 12:05 am IST

యంగ్ హీరో శర్వానంద్,కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు ప్రశాంత వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం “రణరంగం”. శర్వానంద్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. యంగ్ రొమాంటిక్ ఫెలో గా ఒక పాత్రలో కనిపించనున్న శర్వా,మరో పాత్రలో గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల కానుంది.

కాగా నేడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందిస్తున్నారు. మురళి శర్మ,ప్రవీణ్,సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More