‘రణరంగం’ నుండి ‘కన్ను కొట్టి’ రాబోతుంది !

Published on Jul 19, 2019 11:31 pm IST

యువ హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో ‘రణరంగం’ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి సెకెండ్ సాంగ్ ‘కన్ను కొట్టి’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ కాబోతుంది. జూలై 20న సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాట విడుదల కాబోతుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందట. అలాగే ఎమోషన్స్ తో కూడినదై ఉంటుందని శర్వానంద్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతుంది చిత్రబృందం. కాగా ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

సంబంధిత సమాచారం :