‘రంగమార్తాండ’ కి అందరి నుండి రంగరంగ వైభవం

Published on Mar 22, 2023 9:30 pm IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ రంగమార్తాండ. మరాఠీ మూవీ నటసామ్రాట్ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆలీ రెజా తదితరులు నటించగా మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని ఉగాది సందర్బంగా నేడు ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు మేకర్స్. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు.

ఇక నేడు మొదటి ఆట నుండి అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటూ అలరిస్తూ మంచి టాక్ తో దూసుకుపోతోంది రంగమార్తాండ మూవీ. ముఖ్యంగా రంగస్థల కళాకారుల జీవితం, అందులోని కష్ట సుఖాలను వారి ఆలోచనలు, భావోద్వేగాలను దర్శకుడు కృష్ణవంశీ ఎంతో అద్భుతంగా చూపించారని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అలానే కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ తమ తమ పాత్రల్లో కనబరించిన సహజ నటనకు ప్రేక్షకుల నుండి మరింత గొప్ప ప్రసంశలు అందుతున్నాయి. మొత్తంగా తమ సినిమా అందరినీ అలరిస్తుండడంతో రంగమార్తాండ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :