సమయం దగ్గరపడినా ‘రణరంగం’ ఊసే లేదు

Published on Jul 15, 2019 9:24 pm IST

యువ హీరో శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ డైరెక్షన్లో ‘రణరంగం’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులే అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చిత్రాన్ని ఆగష్టు 2వ తేదీన విడుదలచేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.

అంటే విడుదలకు ఇంకో 15 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్, రెండు వారల క్రితం విడుదలై టీజర్ మినహా చిత్రం నుండి మరో అప్డేట్ బయటకురాలేదు. నిర్మాణ సంస్థ ప్రచార కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్న దాఖలాలు కూడా లేవు. దీంతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ట్రైలర్ ఎక్కడ, పాటలు ఎప్పడొస్తాయి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరి కీలకమైన ఇలాంటి సమయంలో చిత్ర టీమ్ మౌనం వహించడం వెనుక అర్థం ఏమిటో.

సంబంధిత సమాచారం :

More