చిట్టి బాబు రీసౌండ్ అక్కడ కూడా గట్టిగానే ఉంది!

Published on Jul 14, 2019 11:00 pm IST

టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ మరియు సమంత కాంబినేషన్ లో వచ్చిన “రంగస్థలం” చిత్రం గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించి నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర తన దమ్ము చూపించడంతో పాటుగా నటునిగా మరింత పరిణితి చెంది విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు.తెలుగు సినీ చరిత్రలో ఒక మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం 50 ఏళ్ల తర్వాత కన్నడ భాషలో డబ్ అయ్యి విడుదల అయిన రెండో సినిమాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం మన తెలుగులో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అక్కడ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకున్నట్టు అక్కడి సినీ వర్గాలు చెప్తున్నాయి.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో తెరకెక్కి 120 కోట్లకు పైగా షేర్ ను ఈ చిత్రం కొల్లగొట్టింది.విలేజ్,పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ప్రేక్షకులకు తెగ నచ్చేసిందట.ఇప్పుడు ఈ చిత్రం అక్కడ కూడా అద్భుతమైన రివ్యూలు సొంతం చేసుకొని మన దగ్గరలాగే బ్లాక్ బస్టర్ రీసౌండ్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.మరి ఈ చిత్రం అక్కడ ఎంత వరకు రాబడుతుందో చూడాలి.దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కన్నడ భాషలో కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More