అమెరికాలో రంగస్థలం సరికొత్త రికార్డులు

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ – సమంత నటించిన రంగస్థలం సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి నటీనటుల కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో రంగస్థలం సినిమా అత్యధిక వసూళ్లు అందుకున్న మూడవ తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. బాహుబలి తరువాత ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం సినిమానే అత్యధిక వసూళ్లు సాధించింది.

ఇప్పటివరకు రంగస్థలం 3 మిలియన్ల డాలర్లను రాబట్టింది. బాహుబలి 1 ($ 6.8M) మరియు బాహుబలి 2 ($ 11.8M) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. యూఎస్ ప్రమియర్స్ ద్వారా రంగస్థలం సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఇక ఇలానే కలెక్షన్స్ కొనసాగితే సినిమా 3.5 మిలియన్ మార్క్ ను ఈజీగా అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే 12వ తేదీన నాని కృష్ణార్జున యుద్ధం రిలీజ్ కాబోతోంది. మరి ఆ సినిమా ప్రభావం ఏమైనా పడుతుందో లేదో చూడాలి.