కన్నడలోనూ ‘రంగస్థలం’కు పాజిటివ్ టాక్

Published on Jul 12, 2019 11:00 pm IST

తెలుగులో ఘన విజయాన్ని అందుకున్న ‘రంగస్థలం’ చిత్రాన్ని కన్నడలో ‘రంగస్థల’ పేరుతో డబ్ చేసి ఈరోజే విడుదలచేశారు. సుమారు 85 స్క్రీన్లలో సినిమా విడుదలైంది. ఒక్క బెంగుళూరులో ఈరోజు 26 షోస్ వేయడం జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ మొదలైంది.

సినిమాలోని పల్లెటూరి నేపథ్యం, బలమైన కథ కన్నడిగులకు కనెక్ట్ అయ్యాయట. ఇక చరణ్, సమంతల నటనకు కూడా అభినందనలు దక్కుతున్నాయి. మొత్తానికి కొన్ని దశాబ్దాల విరామం తర్వాత కన్నడలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రం ‘రంగస్థలం’ మంచి పేరును సంపాదించుకునే దిశగానే వెళుతోంది. జేఎం మూవీస్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ అనువాదాన్ని కన్నడనాట రిలీజ్ చేసింది.

సంబంధిత సమాచారం :

X
More