‘మగధీర’కు చేరువలో ‘రంగస్థలం’ !

9th, April 2018 - 10:48:42 AM


మెగా హీరోలకి మంచి పట్టుకున్న ఏరియాల్లో నైజాం కూడ ఒకటి. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’ ఈ రీజియన్లో బ్రహ్మాండమైన రన్ కనబరుస్తూ చాలా చోట్ల చిత్రం హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. మొదటి వారంలోనే రికార్డ్ స్థాయి షేర్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.19.60 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుని త్వరలోనే రూ. 20 కోట్లను అందుకోనుంది.

రామ్ చరణ్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ గా రికార్డులకెక్కిన ‘మగధీర’ (రూ.22.64 కోట్లు) తర్వాత ఆ స్థాయి కలెక్షన్లను పొందిన చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది. ఇక ఓవర్సీస్లో కూడ 3 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కును క్రాస్ చేసిందీ చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.