రంగస్థలం పాటకు మంచి స్పందన !


చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని మొదటిపాట ఈరోజు సాయంత్రం విడుదల అయ్యింది. ఎంత సక్కగున్నవే అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ పాడగా చంద్రబోస్ రచించారు. మాస్ బీట్స్ తో మంచి లిరిక్స్ తో ఈ పాట విడుదలైన కొద్దిసేపటిలోనే పాపులర్ అయ్యింది. మర్చి 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో సుకుమార్ కు ఒక స్టైల్ ఉంది. రంగస్థలం సినిమాను అదే తరహాలో అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉండబోతుందని సమాచారం. రత్నవేలు సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలో అనసూయ ప్రదాన పాత్రలో కనిపించబోతోంది. ఆది పినిశెట్టి చరణ్ కు సొంత అన్నయ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

పాట కోసం క్లిక్ చెయ్యండి