వేగం పెంచిన ‘రంగస్థలం’ టీమ్ !

ఇటీవలే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న ‘రంగస్థలం’ చిత్రం ఈ నెల 30న విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. ఒకవైపైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా ఇంకో వైపు ప్రచార కార్యక్రమాలు కూడ ఊపందుకున్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ కాగా చిత్ర యూనిట్ సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు పాటల ప్రోమోలను రిలీజ్ చేస్తోంది.

ఇప్పటికే ‘రంగమ్మ మంగమ్మ’ ప్రోమో విడుదలై ఆకట్టుకోగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘రంగ రంగ రంగస్థలాన’ పాట యొక్క ప్రోమో విడుదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే ఒక ప్రత్యేక గీతంలో అలరించనుంది.