త్వరలో రంగస్థలం టైటిల్ సాంగ్ విడుదల !
Published on Feb 26, 2018 8:30 pm IST

సుకుమార్ చరణ్ తో చేస్తోన్న రంగస్థలం సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆది పినిశెట్టి, చరణ్ మద్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరి ప్రధానంగా సాగే ఈ సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ హైలెట్ గా ఉండబోతోందని సమాచారం. అనసూయ జగపతి బాబు మరో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా మర్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటిపాటకు మంచి రెస్పాన్స్ లభించింది. వచ్చే వారం సినిమాలోని టైటిల్ సాంగ్ విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ ఆర్కె బీచ్ లో మర్చి 18న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook