సుకుమార్ దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘రంగస్థలం’. మార్చి 30 న విడుదలైన ఈ చిత్రం ఇటీవల 100 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించి టాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా 2 వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా సుమారు 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. విల్లెజ్ నేపథ్యంలో సాగె కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం తమిళ , మలయాళ భాషల్లోకి అనువాదం కానుంది. ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని తమిళ భాషలో విడుదలచేయనున్నారట. దాంతో పాటుగా మలయాళ భాషలోకూడా ఈచిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
