‘రంగస్థలం’ సినిమా అవార్డులకు కూడ వెళ్తుంది : రామ్ చరణ్


వాస్తవికతకు దగ్గరగా ఉండే కథతో, పాత్రలతో, నైపథ్యంతో రూపొందిన సినిమా ‘రంగస్థలం’. టీమ్ రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్స్ చూసిన ప్రేక్షకులు, మెగా అభిమానులు, విమర్శకులు చిత్రం ఖచ్చితంగా పలు రికార్డుల్ని కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. వారితో పాటే రామ్ చరణ్ కూడ ఈ సినిమా అవార్డులకు వెళ్తుందని నమ్మకంగా ఉన్నారు.

ఇటీవలే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కమర్షియల్ అంశాలు, విమర్శకులను మెప్పించే కంటెంట్ ను కలిపి తీసిన సినిమా ‘రంగస్థలం’. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా అవార్డ్స్ కు కూడ వెళుతుంది. పాత రోజుల్లో సినిమాలంటే ఇలానే ఉండేవి అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది.