కన్నడ లో కూడా విడుదలకానున్న చరణ్ సినిమా !

Published on Mar 4, 2019 12:55 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం గత ఏడాది విడుదలై 120కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం కన్నడ తో పాటు మలయాళ ,తమిళంలో డబ్ అవుతుంది.

ఈ మూడు వెర్షన్లు కూడా ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక తెలుగు సినిమాలు తమిళ , మలయాళ భాషల్లో డబ్ అవ్వడం సాధారణంమే కానీ కన్నడ లో చాలా రేర్ గా డబ్ అవుతుంటాయి.

మరి తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఆక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సుకుమార్ తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా లో సమంత కథానాయికగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :