‘టెంపర్’ హిందీ రీమేక్ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 12, 2018 1:58 pm IST

ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం అని తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం హిందీ రీమేక్ లో రణవీర్ సింగ్ మరియు సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సింబా’ టైటిల్ తో బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న ఈ చిత్రం డిసెంబర్ 3వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుందని తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా డిసెంబర్ 28వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కరణ్ జోహార్, రోహిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే గోవాలో చివరి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సరి కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More