పిక్ టాక్ : ‘రావు బహదూర్’ సక్సెస్ జోష్‌లో జాయిన్ అయిన మహేష్ బాబు..!

పిక్ టాక్ : ‘రావు బహదూర్’ సక్సెస్ జోష్‌లో జాయిన్ అయిన మహేష్ బాబు..!

Published on Jul 24, 2026 4:59 PM IST

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా చిత్రం ‘రావు బహదూర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమాకి వస్తున్న విశేష స్పందన మరియు విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తమ బ్లాక్‌బస్టర్ మూమెంట్‌ను ఘనంగా జరుపుకుంది.

ఈ సందర్భంగా హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా, నటి దీపా థామస్, అలాగే చిత్ర నిర్మాతలు మరియు సాంకేతిక నిపుణులు మహేష్ బాబుతో కలిసి సందడి చేశారు. మహేష్ బాబును కలిసి సినిమా సాధిస్తున్న విజయాన్ని పంచుకోవడమే కాకుండా, ఆయన అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. సైకాలజికల్ డ్రామా, డార్క్ కామెడీ మరియు సస్పెన్స్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా వేదికపై ఒక కొత్త అనుభూతిని అందిస్తోందని మేకర్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు