
ఈ మధ్య అన్ని సినిమాలలో కనిపిస్తున్న బహుముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవ్వరంటే, టక్కున గుర్తొచ్చే పేరు రావు రమేష్. అయన ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూలై 3వరకు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, ద్రాక్షారామం, అమలాపురం ప్రాంతాలలో జరుగనుంది. ఈ సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని డైలాగులు చాలా వైవిధ్యంగా ఉంటాయని, ప్రేక్షకులు చాలా కాలం వరకు గుర్తుంచుకుంటారని తెలిపారు. సినిమా టైటిల్ ‘గొల్లభామ’ కాదని అన్నారు.
ఇక డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి అయన మాట్లాడుతూ, సినిమాలో ఈ సన్నివేశానికి ఈ డైలాగ్ అని ఏమి ఉండదని, అసలు డైలాగులను గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. శ్రీకాంత్ మొదట కెమెరా రన్ చేసి, అందరి బాడీ లాంగ్వేజ్ ని గమనిస్తాడని తెలిపారు. అయనతో పని చేయాలంటే, షూటింగ్ మొత్తాని ఎంజాయ్ చేయాలనీ, ఆయన చేసేది కాస్త ఆలస్యం అయినా కూడా సినిమా అద్భుతంగా తెరకేక్కుతుందని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు 12 రోజులు షూటింగ్ చేసానని, ఈ సినిమాతో శ్రీకాంత్ మరో పెద్ద హిట్ ఇస్తాడని రావు రమేష్ ఆశాభావం వ్యక్తం చేసాడు. ఈ సినిమా ఒక టౌన్ నేపధ్యంలో ఉంటుందని, కానీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో లాగా ఈ సినిమాలోని పాత్రలు ఎలాంటి ప్రత్యేకమైన యాసను ఉపయోగించలేదు.