జగన్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి – రాశి ఖన్నా

Published on Dec 15, 2019 12:04 pm IST

మహిళల పై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏపీ దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎపి శాసనసభ దిశ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. కాగా ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ తీసుకున్న ఈ నిర్భయానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు తన సపోర్ట్ ను ప్రకటించారు. కాగా తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఈ అంశం పై స్పందించింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాల మంచిందని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం.. తప్పు చెయ్యాలనుకునే వారిలో వస్తోందని… ఈ చట్టాన్ని మిగిలిన సిటీస్ లో మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని రాశి ఖన్నా కామెంట్స్ చేసింది. అన్నట్లు మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లుకు ప్రతిపక్షం టీడీపీ కూడా తమ మద్దతును తెలిపింది.

సంబంధిత సమాచారం :

X
More