మొత్తానికి “వెంకీ మామ” హీరోయిన్ కన్ఫామ్ అయ్యింది..!

Published on Feb 22, 2019 9:34 am IST

నాగచైతన్య వెంకటేష్ ల కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ. ఈ సినిమా హీరోయిన్ విషయంలో రోజుకో పేరు వినిపిస్తుంది.

గతంలో రకుల్ ప్రీత్ సింగ్ అని, నాభా నటేష్ అని వార్తలొచ్చాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బాబీతో కలిసి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :