సిగరెట్ స్మోక్‌పై రష్మిక ఏం సమాధానం చెప్పిందంటే?

Published on Jul 1, 2021 1:07 am IST


ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన వరుస సినిమాలతో బిజీ బిజీగా లైఫ్ గడుపుతుంది. చాాలా తక్కువ టైమ్‌లో స్టార్ హీరోల సరసన నటించి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చి తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ రష్మికకు ఓ తింగరి ప్రశ్న వేశాడు. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతావు అని రష్మికను అడిగేశాడు. అయితే ఈ ప్రశ్నకు ఓపిగ్గా సమాధానమిచ్చిన రష్మిక తనకు సిగరెట్ తాగే అలవాటు లేదని చెప్పింది. అంతేకాదు తనకు స్మోక్ అంటే అసహ్యం అని, తన చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్‌ కాల్చితే కూడా అసౌకర్యంగా ఫీలవుతానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :