రష్మిక రెమ్యునరేషన్ తక్కువేనట !

Published on Oct 3, 2018 7:36 pm IST

ఛలో చిత్రం తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టింది. ఈచిత్రం తరువాత ఆమె నటించిన రెండవ చిత్రం ‘గీతగోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక మూడవ చిత్రం దేవదాస్ కొద్దీ రోజుల క్రితం విడుదలై డీసెంట్ టాక్ తో విజయం వైపు దూసుకుపోతుంది.

ఇలా ఆమె నటించిన 3చిత్రాలు హిట్ అవ్వడంతో వరుస ఆఫర్ల తో బిజీ అవుతుంది. కానీ ఇదే అదునుగా భావించి ఆమె పారితోషికాన్ని పెంచట్లేదట. అలాగే షో రూమ్ ఓపెనింగ్స్ కుగాను రష్మిక కేవలం 5లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుంటుందట. మాములుగా హీరోయినన్లు ఇలాంటి షాప్ ఓపెనింగ్స్ కు 10లక్షల కంటే తక్కువగా తీసుకోరు. కానీ రష్మిక తన రెమ్యూనరేషన్ ను తగ్గించి ఆఫర్లను చేజిక్కించుకోవాలనుకుంటుందట. దాంట్లో భాగంగానే తక్కువ పారితోషికమైన పర్వాలేదు ఆఫర్లు ఉండేలా చూసుకుంటుందని టాక్.

సంబంధిత సమాచారం :