వైరల్ వీడియో : తన క్యూట్ పెట్ ని ఇంట్రొడ్యూస్ చేసిన రష్మిక మందన్న

Published on Jul 12, 2022 9:30 pm IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఇటు తెలుగు తోపాటు అటు పలు ఇతర భాషల సినిమాలు కూడా చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అర్జున్ తో పుష్ప 2 మూవీ చేస్తున్న రష్మిక మందన్న, దుల్కర్ సల్మాన్ సీతారామంలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అయితే సినిమాల్లో బిజీగా ఉంటూనే మధ్యలో తన మూవీస్, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు రష్మిక.

ఇటీవల బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ తో కలిసి ఆమె చేసిన ఇన్స్టా రీల్ అందరినీ ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం ఆమె తన క్యూట్ లిటిల్ క్యాట్ స్నో ని తొలిసారిగా అందరికీ పరిచయం చేసారు. తనతో కలిసి దిగిన సెల్ఫీ వీడియోని పోస్ట్ చేసిన రష్మిక, ఫస్ట్ టైం స్నో ని మీముందుకు తీసుకువస్తున్నాను, రాబోయే మరొక మూడు సంవత్సరాల్లో మా ఇల్లు మినీ జంగిల్ గా మారినా మారవచ్చు అంటూ సరదాగా తన పోస్ట్ లో తెలిపారు రష్మిక మందన్న. ప్రస్తతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :