మహేష్ బాబుతో సరితూగుతానో లేదో తెలీదంటున్న రష్మిక

Published on Dec 11, 2019 8:03 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చివరి దశ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలతో పాటు ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే ఇందులో కథానాయిక రష్మిక మందన్న. తెలుగులోకి అడుగిడిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంది ఆమె. అందుకే మహేష్ జోడీగా ఆమె ఎలా కనిపిస్తుందో చూడాలని అందరికీ ఆసక్తి.

రష్మిక సైతం మహేష్ పక్కన నటిస్తుండటం తొలిసారి కావడంతో ఎగ్జైట్ అవుతోంది. అంతేకాదు మహేష్ బాబు డ్యాన్సులతో తాను సరితూగగలనో లేదో తెలీడం లేదని, అందుకే తన వంతుగా రిహార్సల్స్ మీద ఎక్కువ దృష్టిపెట్టానని అంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట.

సంబంధిత సమాచారం :

More