అతని అభిమానిని అయిపోయాను – రష్మిక

Published on Feb 25, 2020 5:51 pm IST


‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘భీష్మ’ మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తుంది. కేవలం మూడు రోజులలోనే భీష్మ ఆంధ్రా మరియు తెలంగాణాలలో కలిపి 14.89 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది. మొత్తానికి నితిన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది.

ఈ సందర్భంగా మేకర్స్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో రష్మిక మండన్నా మాట్లాడుతూ .. ఈ మూవీని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. క్రిటిక్స్ మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీకి రుణపడి ఉంటాను. ‘భీష్మ’ పాత్రలో నితిన్ ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డాను. మంచి మ్యూజిక్, చక్కని సినిమాటోగ్రఫీతో అన్నీ చక్కగా కుదిరిన సినిమా ఇది. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్” అన్నారు. ఓవరాల్ గా రష్మికకు కూడా ఈ సినిమా భారీ హిట్ ను అందించింది.

సంబంధిత సమాచారం :

X
More