విజయ్ తో సినిమాపై ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్న రష్మికా..!

Published on Apr 7, 2022 12:33 pm IST

లేటెస్ట్ గా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర అనౌన్స్ చేసిన మరో క్రేజీ ప్రాజెక్ట్ “థలపతి 66”. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లితో అనౌన్స్ చేసిన ఈ భారీ సినిమాతోనే విజయ్ తెలుగు ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమా నిన్ననే గ్రాండ్ గా లాంచ్ కాగా చిత్ర ప్రధాన యూనిట్ అంతా కూడా హాజరు కాగా ఇండస్ట్రీ వర్గాల్లో అటు తమిళ్ మరియు తెలుగులో ఈ సినిమా హైలైట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో మొదటిసారిగా విజయ్ తో రష్మికా మందన్నా నటిస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చెయ్యగా విజయ్ తో ఫస్ట్ టైం నటిస్తుండడంతో రష్మికా అయితే ఓ రేంజ్ లో ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. అసలు మాటల్లో చెప్పలేని విధంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న తరుణం ఇప్పుడు వచ్చింది అని విజయ్ సర్ తో యాక్ట్ చెయ్యబోతున్నాను పాటలకి కలిసి డాన్స్ చెయ్యబోతున్నాను.

ఇదంతా ఒక వేరే ఫీల్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో విజయ్ తో కలిసి కొన్ని ఫోటోలు నిన్న ముహూర్తం నుంచి షేర్ చేసుకుంది. దీనితో ఇద్దరి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై ఈ జంట కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :