ఇప్పుడు మన టాలీవుడ్ లో మోస్ట్ లక్కీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రష్మికా మందన్నా అనే చెప్పాలి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకొని మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్.
ఇది మాత్రమేనా లేటెస్ట్ గా గూగుల్ లో నేషనల్ క్రష్ గా ఈమెను ప్రకటించేసారు. మరి ఇన్ని అంశాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ స్టాట్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అయ్యింది. అది కూడా ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో అక్కడి యువ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న “మిషన్ మజ్ను” అనే చిత్రంలో నటించనుంది.
అయితే ఈ చిత్రం నిజ జీవిత ఘటనల ఆధారంగా పాకిస్తాన్ లో ఇండియన్ ఇంటెలిజెన్స్ వారు జరిపే ఒక సీక్రెట్ మిషన్ ఆధారంగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నారు. మరి రష్మికాకు బాలీవుడ్ లో ఎలాంటి వెల్కమ్ దక్కుతుందో చూడాలి.


