కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రష్మిక !

Published on Feb 23, 2019 1:57 pm IST


‘ఛలో’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆ సినిమా విజయం సాధించడంతో టాలీవుడ్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ లో నటిస్తుండగా అలాగే నితిన్ భీష్మ సినిమాకి కూడాసైన్ చేసింది. అలాగే కన్నడలో కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్.

తమిళ హీరో కార్తీ తో ‘రెమో’ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రానికి రష్మిక ను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడున్నాయి.

సంబంధిత సమాచారం :