“రావణాసుర” పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Ravanasura

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సాలిడ్ చిత్రాల్లో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం “రావణాసుర” కోసం తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు అయితే ఈ సినిమా ట్రైలర్ పై అయితే మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ ట్రైలర్ ఈ 28న రిలీజ్ కానుండగా లేటెస్ట్ గా అయితే దర్శకుడు సుధీర్ వర్మ ఇంట్రెస్టింగ్ క్లారిటీ అందించాడు. ఈ సినిమా అయితే అసలు ఎలాంటి సినిమాకి కూడా రీమేక్ కాదని ఇది కేవలం రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్న కంప్లీట్ కొత్త కథ అని కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ సాలిడ్ థ్రిల్లర్ కి హర్ష వర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సంగీతం అందిస్తుండగా అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 7 న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version