కెజిఎఫ్ లో ఆమెది నెగెటివ్ రోల్ అట.

Published on Apr 1, 2020 4:35 pm IST

దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్న చిత్రాలలో కెజిఎఫ్ 2 ఒకటి. 2018 లో వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపుగా వస్తుందీ చిత్రం. మొదటి భాగం అన్ని భాషలలో సంచలన విజయం సాధించడంతో ఈ పార్ట్ పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ హిందీ, తెలుగు, కన్నడ మరియు తమిళ, మలయాళ భాషలలో విడుదల కానుంది. కెజిఫ్ లో హీరోగా చేసిన యష్ ఈ చిత్రం తరువాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా కెజిఎఫ్ 2లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె దేశ ప్రధాని పాత్ర చేస్తున్నట్లు సమాచారం. కాగా కెజిఫ్ సినిమాలో తన పాత్ర గురించి అడుగగా ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మూవీలో ఆమె పాత్ర వైవిధ్యం తో పాటు నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందట. ఈ సినిమాలో నటించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను అన్న ఆమె, చాల కాలం తరువాత సంజయ్ దత్ తో చేయడం ఆనందం అనిపించింది అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More