ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రోర్.. సౌండింగ్ లో రవి బసృర్ బిజీ!

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రోర్.. సౌండింగ్ లో రవి బసృర్ బిజీ!

Published on May 17, 2026 3:01 PM IST

NTRNeel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ చిత్రమే డ్రాగన్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యం అయినప్పటికీ నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకొని దుమ్ము లేపింది. ఇక ఫైనల్ గా బిగ్ ట్రీట్ కి సమయం దగ్గరకి వస్తుండగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. డ్రాగన్ సినిమా తాలూకా ఫస్ట్ గింప్స్ ని మేకర్స్ ఈ మే 20 తారక్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు రవి బసృర్ ఈ సినిమా తాలూకా సౌండింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్టు మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. సంగీత దర్శకుడు తన స్టూడియోలో బిజీగా ఉన్న పిక్ ని షేర్ చేసి ఫ్యాన్స్ లో మరింత హైప్ ని పెంచారు. దీనితో డ్రాగన్ సౌండింగ్ ఎలా ఉంటుందో అని గ్లింప్స్ కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్, కేజియఫ్ చిత్రాలకి తన వర్క్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఈ రానున్న ట్రీట్ పట్ల మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు