విరాళ దాతల లిస్టులో రవితేజ, రామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం

విరాళ దాతల లిస్టులో రవితేజ, రామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం

Published on Oct 15, 2014 10:42 AM IST

raviteja_ram_prakesh_raj
హుదూద్ సైక్లోన్ చేసిన విలయ తాండవం వలన వైజాగ్ తో పాటు, ఉత్తరాంధ్రలోని 4 జిల్లాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి అతీతంగా ఎందరో ముందుకు వచ్చి వారికి విరాళాల రూపంలో సాయం అందిస్తున్నారు. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ హీరోలు కూడా ముందున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, కృష్ణ, విజయ నిర్మల లాంటి వారు విరాళం ఇచ్చారు.

తాజాగా వీరి లిస్టులో మాస్ మహారాజ రవితేజ, ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా చేరారు. రవితేజ 20 లక్షలు డొనేట్ చేయగా, రామ్ 10 లక్షలు డొనేట్ చేయగా, ప్రకాష్ రాజ్ 5 లక్షలు చేయగా, కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా 3 లక్షల విరాళాన్ని డొనేట్ చేసారు.

ఈ హీరోల స్పూర్తితో ఎంతోమంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అలాగే చాలా మంది హీరోలు కూడా తమ వంతు సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇండస్ట్రీ నుంచి కొన్ని కోట్ల తూపాయలు హుదూద్ సహాయ నిధికి వెళ్ళే అవకాశం ఉంది.

తాజా వార్తలు