కొత్త సినిమాకి సిద్ధం అయిన రవితేజ !

Published on Feb 22, 2021 12:02 am IST

మాస్ మహా రాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం రమేష్ వర్మ ఖిలాడీ చేస్తున్నాడు. దీని తరువాత సినిమాని రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ తో చేయబోతున్నానని రవితేజ అధికారికంగా ప్రకటించాడు. దాదాపు ఏప్రిల్ నుండి ఈ సినిమానే రవితేజ ముందు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది.

ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More