లెక్చరర్ పాత్రలో కనిపించనున్న రవితేజ!

లెక్చరర్ పాత్రలో కనిపించనున్న రవితేజ!

Published on Oct 24, 2015 3:48 PM IST

RaviTeja-dil-raj
మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్లో ‘ఎవడో ఒకడు’ అన్న ఆసక్తికర టైటిల్‌తో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా దసరా పర్వదినం సందర్భంగా లాంచనంగా ప్రారంభమైంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. ఇక నవంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో రవితేజ్ రోల్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది.

ఎవడో ఒకడులో రవి తేజ ఓ లెక్చరర్‌గా కనిపిస్తారని సమాచారం. ఒక ఇన్‌స్పైరింగ్ లెక్చరర్ పాత్రలో రవితేజ తన స్టైల్లో మెప్పిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుపమ, రవి తేజ స్టూడెంట్‌గా కనిపిస్తారట. ఇక మిరపకాయ్ సినిమాలో ఓ సరదా లెక్చరర్ పాత్రలో విపరీతంగా అలరించిన రవి తేజ మరోసారి లెక్చరర్‌గా కనిపించనుండడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఓ మంచి కథతో రూపొందుతోన్న ఈ సినిమా సమ్మర్ సీజన్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని దిల్‌రాజు తెలిపారు. రవితేజ సరసన మరో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

తాజా వార్తలు