మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో ?

Published on Mar 23, 2019 9:55 am IST

రవితేజ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక రవితేజ బాడీ లాంగ్వేజ్ కి మరియు మాడ్యులేషన్ కు తగ్గట్లుగా అలాగే తెలుగుకు అనుగుణంగా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేశాడట దర్శకుడు. మరో ఈ మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్.

కాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం వి ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More