‘అదుగో’ ఫస్ట్ లుక్ వచ్చింది !
Published on Sep 1, 2018 11:51 am IST

ఎట్టకేలకు క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ‘అదుగో’ చిత్రం విడుదల అవ్వడానికి సన్నద్ధం అవుతుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది. పైగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.

కాగా తాజాగా ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. హాయ్‌.. మై నేమ్ ఈజ్ బంటీ అంటూ పందిపిల్ల ఫోటోతో విడుద‌లైన ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నే విధంగా ఉంది. లైవ్ యాక్ష‌న్ త్రీడీ సాంకేతిక‌తో రోపొందిన ఈ చిత్రం ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది. రవిబాబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • 7
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook