తనవంతు సాయంగా 10లక్షలు విరాళమిచ్చిన మాస్ మహారాజ్

ravi-teja
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకరోక్కరిగా హుదుద్ తుఫాను బాధితులకు తమకు చేతినైనంత సాయం చేసుందుకు నడుంకట్టారు. ఇప్పటికే పలువురు అగ్రతారలు సహాయార్ధం ధనరూపంలో బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరివరుసలోకి మాస్ మహారాజ్ రవితేజ కూడా చేరారు.

తాను ఈ విద్వంసం చూసి తట్టుకోలేకపోతున్నట్టు తెలిపాడు. తనవంతు సాయంగా బాధితులకు 10లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాక రవితేజకు బలుపు, డాన్ శీను వంటి సినిమాలు తీసిన గోపీచంద్ సైతం ఒక లక్ష రూపాయిలు సి.ఎం రిలీఫ్ ఫండ్ కి అందజేయనున్నట్టు ప్రకటించాడు