సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’

Published on Dec 12, 2022 9:19 PM IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

మొదటి నుండి ఈ క్రేజీ మూవీ పై రవితేజ ఫ్యాన్స్, అలానే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండడం, ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఇలా అన్ని ధమాకా మూవీ పై ఆడియన్స్ లో ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.

కాగా ఈ మూవీకి నేడు సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించగా సెన్సార్ బోర్డు వారు దీనికి యు/ఏ సర్టిఫికెట్ కేటాయించారు. కాగా ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఈనెల 15న విడుదల చేయనుండగా మూవీని క్రిస్మస్ కానుకగా 23న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు