రవితేజ రెమ్యునరేషన్ పెంచారా ?

Published on Feb 23, 2021 8:17 pm IST

‘క్రాక్’ విజయంతో మాస్ మహారాజ్ రవితేజ హిట్ ట్రాక్ ఎక్కారు. లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాల్ని ఆర్జించారు. ఈ విజయంతో రవితేజ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను ప్రూవ్ చేసుకున్నారు. ఈ విజయంతో ఆయన వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న ఆయన తాజాగా త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమాకు రవితేజ రూ.16 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటున్నట్టు ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘క్రాక్’ మంచి విజయం సాధించడమే ఇందుకు కారణం. ఈ సినిమాతో రవితేజ మార్కెట్ పెరిగింది. ఆయనతో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని తెచ్చుకున్నారు. దీంతో నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతూ పెంచిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడటంలేదట. ఇకపోతే ‘ఖిలాడి’ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకురానుంది. త్రినాథ్ రావ్ చిత్రం కూడ ఈ ఏడాదిలోనే విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :