‘బెంగాల్ టైగర్’ టీజర్ తో అదరగొట్టిన రవితేజ

‘బెంగాల్ టైగర్’ టీజర్ తో అదరగొట్టిన రవితేజ

Published on Oct 14, 2015 4:22 PM IST

Bengal-tiger
‘మాస్ అనేది బస్సు పాస్ కాదుబే ఎవడు పడితే వాడు వాడుకోనీకి, అది మన బలుపుని బట్టి, బాడీ లాంగ్వేజ్ ని బట్టి జనం పిలుచుకునే పిలుపు’ ఇలాంటి మాస్ డైలాగ్స్ కి పెట్టింది పేరైన హీరో మాస్ మహారాజ్ హీరో రవితేజ. ఈ మధ్య కాస్త రూటు మార్చి చేసిన కిక్ 2 సినిమా రవితేజకి పెద్దగా కిక్ ఇవ్వలేదు. దాంతో మళ్ళీ తనకు బిగ్గెస్ట్ హెల్ప్ అయిన మాస్ మసాలా కథతో చేసిన సినిమా ‘బెంగాల్ టైగర్’. ఈ టైటిల్ లో ఎంత పవర్, ఎంత మాస్ ఉందొ దానినే సినిమాలో చూపించడానికి ట్రై చేసారు.

అలా ట్రై చేసిన బెంగాల్ టైగర్ ఎలా ఉంటుందా అనే దానికి సాంపిల్ గా ఈ రోజు ఉదయం ఈ మూవీ ఫస్ట్ టీజర్ ని లాంచ్ చేసారు. ఈ టీజర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యగా డైరెక్టర్ సంపత్ నంది రవితేజ ని పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేసారని కితాబులిస్తున్నారు. ఈ టీజర్ లో రవితేజ చెప్పిన ‘నేను క్లైమేట్ లాంటోన్ని అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వనికిస్తా’ అనే డైలాగ్ రవితేజ బాడీ లాన్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది. రవితేజ సరసన తమన్నా, రాశీ ఖన్నాలు హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 18న రిలీజ్ చేసి, నవంబర్ 5న సినిమాని రిలీజ్ చేయనున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు