‘టైగర్ నాగేశ్వర్రావు’ రవితేజ.. నిజమేనా ?

Published on Aug 9, 2021 7:03 pm IST

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల దర్శకుడు వంశీ కృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరో రవితేజ నటించబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్త పై చిత్రబృందం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఈ సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా కామెడీ బాగా చేస్తాడని తెలుస్తోంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు.

మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.

సంబంధిత సమాచారం :