మెగాస్టార్ వ్యాఖ్యలకి రవితేజ రిప్లై.!

Published on Dec 28, 2022 11:09 am IST

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ మరియు మాస్ మహారాజ రవితేజ హీరోలుగా నటిస్తున్న మెగా మాస్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తుండగా భారీ హైప్ దీనిపై నెలకొంది.

ఇక నిన్ననే ఈ సినిమా యూనిట్ అంతా తమ భారీ సెట్ లో మినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ప్రెస్ మీట్ ని మేకర్స్ నిర్వహించగా మెగాస్టార్ అయితే మాట్లాడుతూ అప్పుడు రవితేజ కోసం మెన్షన్ చేయడం మర్చిపోతే తర్వాత ఈ అంశంపై చాలా మదన పడ్డాను అని తన ట్విట్టర్ ద్వారా రవితేజతో వర్క్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని పెట్టారు.

దీనితో రవితేజ మెగాస్టార్ వ్యాఖ్యలపై ఆనందం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. అన్నయ్య నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గొప్పగా ఆనందంగా ఉంది అని నీ మాటలతో ఇంకా ఆనందంగా ఉంది అని అయితే తాను ఆనందం వ్యక్తం చేశారు. దీనితో వీరి ట్వీట్ లు అభిమానులు మధ్య వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :