మాస్ మహారాజ్ డైరెక్టర్ కి కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన తమ నిర్మాత.!

Published on Jan 30, 2022 12:00 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో మొదటి సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఖిలాడి”. తన కెరీర్ లో బిగ్ హిట్ అయిన “క్రాక్” తర్వాత స్టార్ చేసిన ఈ సినిమా ని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు.

మరి రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సహా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా అంతే స్థాయి అంచనాలు ఇప్పుడు ఈ సినిమాపై నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి నిర్మాత అయినటువంటి ఏ స్టూడియోస్ అధినేత కోనేరు సత్యన్నారాయణ తమ దర్శకునికి ఒక ఖరీదైన కార్ ని బహుమానంగా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

దాదాపు ఒక కోటి 15 లక్షల విలువ గల రేంజరోవర్ కార్ ని ఆయన రమేష్ వర్మ కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మాములుగా అయితే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యితే అప్పుడు ఇలా బహుమానాలు ఇవ్వడం చూసి ఉంటాం. కానీ ముందే ఇస్తున్నారంటే సినిమా ఔట్ పుట్ సాలిడ్ గా వచ్చినట్టే అని చెప్పాలి. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఫిబ్రవరి 11 వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :