
హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అనతి కాలంలోనే మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మాస్ మహారాజగా రవితేజ పేరు తెచ్చుకున్నాడు. రవితేజ ఇండస్ట్రీలోకి రాగానే అతనికి హీరోగా పట్టం కట్టి స్వాగతించలేదు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని హీరోగా తనకి ఎవరు అవకాశాలు ఇవ్వలేదని అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారం ఎత్తి ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందిపుచ్చుకొని ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని హీరో అయ్యాడు. ఇంతకీ అసిస్టెంట్ గా ఉన్న రవితేజని హీరోగా ఎవరు పరిచయం చేసారా అనే విషయం రవితేజని అడిగితే ‘ నిన్నేపెళ్ళాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైములో నన్ను చూసి నాలోని టాలెంట్ ని గుర్తించిన కృష్ణ వంశీ చాన్స్ ఇచ్చాడు. ఆయన నన్ను సింధూరం సినిమాకి ఎంపిక చేసినప్పుడు ఇతను హీరో పాత్రకి పనికొస్తాడా అని అందరూ అన్నారు. కానీ వంశీ నాతో ఫోటో షూట్ చేసారు. దాని తర్వాత ఎవరు చెప్పినా వినకుండా నా చేతే చంటి పాత్ర చేయించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా నాకు మంచి పేరు లభించింది. ఆతర్వాత నేను హీరోగా చేసిన నీ కోసం, ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం సినిమాలు నన్ను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా చేశాయని’ రవితేజ తెలిపాడు.
ఆయనే నన్ను హీరోని చేసాడు – రవితేజ
ఆయనే నన్ను హీరోని చేసాడు – రవితేజ
Published on Jul 28, 2013 12:40 PM IST
సంబంధిత సమాచారం
- బాక్సాఫీస్ ర్యాంపేజ్: మాస్ మహారాజా ఊచకోత.. ‘ఇరుముడి’ టికెట్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్
- పాపులర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఆల్ఫా’
- ‘గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు’: చేతిలో కొడవలి, తాటి ముంజలతో శర్వానంద్.. ఆకట్టుకుంటున్న ‘భోగి’ రాఖీ లుక్
- క్రేజీ బజ్.. శంకర్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా!?
- నైజాంలో ‘ఇరుముడి’ మొదటివారం వసూళ్లు ఎంతంటే!
- NBK 111: బాలయ్య స్టైలిష్ లుక్ వైరల్!
- డే 2 భారీగా డ్రాపైన ‘టాక్సిక్’.. ‘ఇరుముడి’కి దగ్గర్లో కూడా లేదుగా!
- మెగాస్టార్ డబుల్ ట్రీట్ గ్యారెంటీనా..?
- ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- నార్త్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘టాక్సిక్’.. అఫీషియల్ గా యశ్ బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ లో
- దసరా సీజన్లో మారనున్న రిలీజ్ డేట్స్.. లెక్కలు కూడా..?
- ‘ఇరుముడి’పై మెగాస్టార్ రివ్యూ: ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు..
- అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
- కన్ఫర్మ్ : ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ సాంగ్ అదే.. స్పీకర్స్‌ను బద్దలుకొట్టేందుకు సిద్ధమైన అనిరుధ్..!
- రవితేజ సినిమా ఖాతాలో మరో అరుదైన ఫీట్!

