అలుపెరగని మాస్ మహారాజ.. మొత్తం మూడు ఉన్నాయ్

Published on Dec 1, 2020 3:00 am IST

ఏడాదికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలతో పలకరిస్తుంటారు మాస్ మహారాజ రవితేజ. కానీ ఈ సంవత్సరం కరోనా లాక్ డౌన్ కారణంగా ‘డిస్కో రాజా’తో సరిపెట్టుకున్నారు ఆయన. అయితే వచ్చే సంవత్సరం మాత్రం మూడు సినిమాలతో పలకరించనున్నారు. మొదటి సినిమాగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

వీలైనంత వరకు సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మూడవ చిత్రం కూడ త్వరలోనే ఫైనల్ కానుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకులకు అండివ్వాలని చూస్తున్నారు. అంటే 2021లో మొత్తం మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు రవితేజ. ఈ మూడు సినిమాలే కాదు 2021 చివరికి ఒకటి రెండు కొత్త సినిమాలకు సైన్ చేసే అవకాశం కూడ ఉంది. ఆయనతో వర్క్ చేయడానికి వక్కంతం వంశీ లాంటి దర్శకులు సిద్దంగా ఉన్నారు. ఈ మూడు సినిమాల్లో ‘క్రాక్, ఖిలాడి’ చిత్రాలు పూర్తిస్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్లు కాగా మూడవ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :