జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో రవి తేజ సినిమా షూటింగ్ !

జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో రవి తేజ సినిమా షూటింగ్ !

Published on Apr 3, 2018 11:28 AM IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలోని న్యూ యార్క్ లో జరుగుతోంది. అది కూడా ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ యొక్క ఖరీదైన ఇంట్లో కావడం విశేషం. ఇందులో షూట్ చేసేందుకు పెద్ద మొత్తాన్నే చెల్లించారట చిత్ర యూనిట్.

ఇకపోతే ఈ చిత్రంలోని ఎక్కువ శాతం అమెరికాలోనే షూట్ చేయనున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ‘నీకోసం, వెంకి, దుబాయ్ శ్రీను సినిమాల’ తరువాత రవితేజ శ్రీనువైట్లల క్రీజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయమే ఉంది.

తాజా వార్తలు