ఖిలాడి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ షురూ…స్పీడ్ పెంచిన మాస్ రాజా!

Published on Jul 26, 2021 4:22 pm IST

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రం షూటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్ లేట్ అవ్వడం పై మాస్ మహారాజా రవి తేజ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్ నేడు షురూ అయింది. అన్ని ఇబ్బందులు తొలగి నేడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇది ఫైనల్ షెడ్యూల్ అని తెలుస్తోంది.

అయితే రవితేజ ఈ చిత్రం లో సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో డింపుల్ హాయతీ మరియు మీనాక్షి దీక్షిత్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ను వీలైన త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :