మాస్ మహారాజ్ సినిమా థియేటర్స్ లోనే.!

Published on Aug 14, 2020 5:30 pm IST

మాస్ మహారాజ్ రవితేజ అంటే మన టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ ఇష్టమే. అతని సినిమాలు కూడ తమ అభిమాన హీరోతో పాటుగా రవితేజ సినిమాలు కూడా హిట్ కావాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజకు ఒక సరైన హిట్ మాత్రం పడలేదు. దీనితో తాను చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదనే నమ్మకం పెట్టుకున్నారు. అయితే అలా రవితేజ చేస్తున్న లేటెస్ట్ చిత్రం “క్రాక్”పై చాలా ఊహాగానాలు వినిపించాయి.

తన హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ ఈ కాప్ డ్రామా పై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఊహించని విధంగా మారడంతో ఈ సినిమా కూడా ఓటిటిలో వచ్చేస్తుంది అని రూమర్స్ వినిపించాయి. కానీ వాటన్నిటినీ బ్రేక్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రం ఓన్లీ థియేటర్స్ లోనే వస్తుంది అని ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More